దసరా రోజు కమల్‌హాసన్‌ కొత్త పార్టీ?

రాజకీయ అరంగ్రేటానికి సిద్ధమయ్యాడు కమల్‌హాసన్‌. తాను పార్టీ పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తమిళనాట వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయదశమి రోజున తన పార్టీ పేరును కమల్‌ హాసన్‌ ప్రటించనున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ ఆ రోజు కుదరకపోతే గాంధీ జయంతి రోజునైనా తన పార్టీ పేరును తెలపనున్నట్లు టాక్‌. అంతేకాదు ఆ వెంటనే నవంబరులో జరగనున్న తమిళనాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కమలహాసన్ పార్టీ పోటీ చేయనున్నట్టు సమాచారం. మొత్తంగా 4వేల మంది అభ్యర్థులను కమల్ బరిలోకి దింపనున్నట్టు తెలుస్తోంది. అలాగే ఓ పార్టీతో పొత్తు లేకుండా ఒంటరిగానే పోటీ చేయాలనే ఆలోచనలో కూడా కమల్ ఉన్నట్టు సమాచారం.

అయితే కాంగ్రెస్‌, డీఎంకే పార్టీలు కమల్‌ని తమవైపుకు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. అయితే, వామపక్షాలతో కలిసి రాజకీయంగా ముందడుగు వేయాలన్నది కమల్‌ ఆలోచన. త్వరలో తమిళనాడులో జరగనున్న స్థానిక ఎన్నికలకు ముందే కొత్త పార్టీని ప్రకటించి, ఆ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున అభ్యర్థుల్ని నిలబెట్టేందుకు కమల్‌ వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

తమిళనాడులోని అధికార అన్నాడీఎంకే పార్టీకీ, అలాగే జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా కమల్‌ పార్టీ సిద్ధాంతాలు వుండబోతున్నాయట. అవసరమైతే డీఎంకే, కాంగ్రెస్‌లతో పొత్తుపెట్టుకోవాలన్న యోచనలోనూ కమల్‌ వున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అయితే, ఇంత తక్కువ టైమ్‌లో కమల్‌ రాజకీయ నిర్ణయం తీసుకోవడం, ‘తొందరపాటుతనం’ అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు సైతం, ఈ విషయంలో కాస్తంత ఆందోళన చెందుతున్నారట.

కమల్‌ కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నమాట నిజమే అయినా, పూర్తిస్థాయిలో కమల్‌ రాజకీయ రంగ ప్రవేశంపై తమకూ సమాచారం లేదని కమల్‌ అభిమానులు అంటున్నారు. అయినాసరే కమల్‌ ఏ నిర్ణయం తీసుకున్నా, ఆ నిర్ణయానికి తమ నుంచి సంపూర్ణ మద్దతు ఆయనకు లభిస్తుందని అభిమాన సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు.

29 total views, 2 views today