అదృశ్యమైన గృహిణి నీటి సొంపులో శవమై తేలింది!

హైదరాబాద్ : మూడు రోజులుగా కనిపించకుండా పోయిన ఓ గృహిణి ఇంట్లోని సంపులోనే శవమై కనిపించింది. ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్ తెలిపిన వివరాల ప్రకారం… పరిగి, నస్కల్ ప్రాంతానికి చెందిన సాజొద్దీన్ కుటుంబం కొన్నేండ్లుగా హఫీజ్‌పేట్ సాయినగర్‌లో నివాసముంటున్నారు. ప్లాస్టిక్ వస్తువుల దుకాణం నిర్వహించే సాజొద్దీన్‌కు భార్య షాజియాబేగం (27)తో పాటు ముగ్గురు కుమారులున్నారు. సోమవారం మధ్యా హ్నం నుంచి షాజియా కనిపించకుండా పోయింది. దీంతో కుటుంబ సభ్యులు మియాపూర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.

రాత్రి షాజియా మృతదేహం ఇంట్లోని సంపులోనే లభ్యమైంది. విషయం తెలుసుకున్న ఆమె పుట్టింటి వారు అర్ధరాత్రివేళ సాజొద్దీన్ ఇంటిపైకి దాడికి దిగారు. తమ బిడ్డను హత్యచేసి సంపులో పడేశారంటూ ఆగ్రహంతో దొరికిన వారిని దొరికినట్టు చితకబాదారు. స్థానికులు వారిని ప్రతిఘటించారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటా హుటిన ఘటనా స్థలానికి చేరుకొని ఇరుపక్షాలను అడ్డుకున్నారు. సాజొద్దీన్ సహా పలువురిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు.

2,366 total views, 56 views today