క్రికెట‌ర్ రోహిత్ శర్మతో లవ్, కిస్ నిజమే: నటి సోఫియా

క్రికెటర్‌ రోహిత్‌ శర్మపై వివాదాస్పద నటి, మోడల్ సోఫియా హయత్ సంచలన వ్యాఖ్యలు చేసింది. రోహిత్‌తో తాను ఒకప్పుడు ప్రేమలో ఉన్నమాట నిజమేనని చెప్పింది. 2012లో రోహిత్‌తో తాను డేటింగ్ చేసినట్లు చెప్పింది. మొదటిసారి కలిసినప్పుడే రోహిత్ తనను ముద్దు పెట్టుకున్నాడని ఈ బ్రిటీష్ ముద్దుగుమ్మ మరో సంచలనానికి తెరతీసింది. లండన్‌లోని ఓ క్లబ్‌లో తామిద్దరం ఏకాంతంగా కలిశామని చెప్పింది.

మోడల్‌‌గా, నటిగా, రియాల్టీ షో కంటెస్టెంట్‌గా గుర్తింపు ఉన్న సోఫియా హయత్‌ త్వరలో తన జీవితంపై ఓ పుస్తకం రాయాలనుకుంటున్నట్టు ఇటీవల మీడియాతో చెప్పింది. అందులో రోహిత్‌ శర్మతో తనకున్న అఫైర్ గురించి ప్రస్తావిస్తున్నట్లు వెల్లడించి సంచలనానికి తెరతీసింది.

‘2012లో లండన్‌లోని ఓ క్లబ్‌లో రోహిత్‌ను నేను తొలిసారి కలిశా. నేను క్రికెట్‌ ఎక్కువగా చూడను. అతడు ఓ క్రికెటర్‌ అన్న విషయం అప్పటికి నాకు తెలీదు. రోహిత్‌ను నాకు నా స్నేహితురాలు పరిచయం చేసింది. ఆ తర్వాత మా మధ్య స్నేహం కుదిరి అది ప్రేమగా మారింది’ అని సోఫియా చెప్పుకొచ్చింది.

మీడియా కంటపడనంత వరకూ రోహిత్‌తో తన బంధం సాఫీగా సాగిందని సోఫియా చెప్పింది. మీడియా నిలదీయడంతో రోహిత్ తప్పించుకున్నాడని.. ఆ తర్వాత అతడితో విడిపోయానని ఆమె వివరించింది. సోఫియాతో రోహిత్ సన్నిహితంగా ఉన్న ఫోటో ఒకటి అప్పట్లో వైరల్ అయింది.

‘అప్పట్లో మా గురించి వార్తలు బయటికి వచ్చినప్పుడు రోహిత్‌ తప్పించుకోవాలనుకున్నాడు. నేను తనకు కేవలం ఓ అభిమానిని మాత్రమేనని చెప్పుకున్నాడు. అది నన్ను ఎంతగానో బాధించింది. అందుకే అతడితో విడిపోయా. ఈ విషయాలన్నీ నేను రాయాలనుకున్న పుస్తకంలో ప్రస్తావిస్తా’ అని సోఫియా చెప్పింది.

బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘బిగ్‌బాస్ సీజన్‌ 7’లో సోఫియా పాల్గొంది. బాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటించింది. ఆమెపై ఇప్పటికే పలు వివాదాలున్నాయి. 2016లో సన్యాసి (నన్)గా మారిపోతున్నానంటూ బహిరంగంగా ప్రకటించింది. ఆ తర్వాత ఏడాదికే తన బాయ్‌ఫ్రెండ్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. అది కూడా వివాదాస్పదం కావడంతో పెళ్లైన ఏడాదికే విడాకులు తీసుకుంది. విరాట్ కోహ్లీతోనూ సోఫియా డేటింగ్ చేసినట్లు గతంలో ఆరోపణలు రావడం గమనార్హం.

2,380 total views, 57 views today