అమెరికాలో మళ్లీ కాల్పులు.. ఐదుగురి దుర్మరణం

గన్ కల్చర్ ఉన్న అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. ఫ్లోరిడా రాష్ట్రంలోని ఓ బ్యాంకులో దోపిడీకి యత్నించి ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఐదుగురు వ్యక్తులు మృతిచెందారు. ఈ ఘటనలో గాయపడ్డ వారికి చికిత్స అందిస్తున్నారు. ఫ్లోరిడా పోలీసుల తెలిపిన వివరాల మేరకు.. సెబ్రింగ్‌ నగరంలోని సన్‌ ట్రస్ట్‌ బ్యాంకులోకి బుధవారం మధ్యాహ్నం ప్రవేశించిన దుండగుడు కొంత సమయం తర్వాత ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డాడు.

నిమిషాల వ్యవధిలో విచక్షణారహితంగా బ్యాంకులో ఉన్న వారిపై కాల్పులు జరిపాడు. దీంతో ఐదుగురు పౌరులు అక్కడికక్కడే మృతిచెందారు. కాల్పులు జరిపిన అనంతరం దుండగుడు పరారయ్యాడు. అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీ పరిశీలించి నిందితుడిని సెబ్రింగ్‌కు చెందిన 21 ఏళ్ల జీపెన్‌ జావర్‌గా గుర్తించారు. కొన్ని గంటల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

2,354 total views, 56 views today