వెలుగులోకి వచ్చిన మరో మల్టీలెవల్ మార్కెటింగ్ మోసం

రాచకొండ పరిధిలో మరో మల్టీలెవల్ మార్కెటింగ్ మోసం వెలుగులోకి వచ్చింది. నాగోల్‌లో గ్రీన్‌గోల్డ్ బయోటెక్ పేరుతో ఏర్పాటు చేసిన ఎంఎల్‌ఎం కంపెనీ మోసాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. గ్రీన్‌గోల్డ్ బయోటెక్ ఎండీ శ్రీకాంత్‌ను ఉప్పల్ పోలీసులు అరెస్ట్ చేశారు. లక్ష రూపాయలు చెల్లిస్తే పల్లీలు వలిచే యంత్రం ఇస్తామంటూ శ్రీకాంత్ చాలామంది నుంచి డబ్బు వసూలు చేశాడు. వేలాది మంది నుంచి 50 కోట్ల నుంచి వంద కోట్ల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. 4 రాష్ర్టాలకు చెందిన వారిని మోసం చేసినట్లు కంపెనీపై ఆరోపణలు వచ్చాయి. గతంలో మహాలైఫ్ పేరుతో మల్టీ లెవల్ మార్కెటింగ్‌ను శ్రీకాంత్ నడిపాడు. శ్రీకాంత్ ను అరెస్ట్ చేసి కంపెనీకి సంబంధించిన వివరాలను పోలీసులు తెలుసుకుంటున్నారు.

2,412 total views, 54 views today