పవన్‌ ఆవేశం తగ్గించుకుంటే మంచిది: టీజీ

జనసేన- తెదేపా పొత్తు అంశంపై తెదేపా రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్‌ చేసిన వ్యాఖ్యలపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాను చేసిన ప్రకటనపై టీజీ వెంకటేశ్‌ వివరణ ఇచ్చారు. ”నా మాటలు పూర్తిగా విని పవన్‌ కల్యాణ్‌ స్పందించి ఉంటే బాగుండేది. నాయకులకు ఆవేశం పనికిరాదు. ఆవేశం తగ్గించుకుంటే పవన్‌కు మంచి భవిష్యత్తు ఉంటుంది. కార్యకర్తలకు ఆవేశం ఉండొచ్చు కానీ, నాయకులకు ఉండకూడదు. పొత్తులపై ఆయా పార్టీల అధినేతలే నిర్ణయిస్తారని చెప్పాను. పొత్తులు ఖరారైతే మార్చిలో చర్చలు ఉంటాయనే చెప్పాను” అని టీజీ వెంకటేశ్‌ వివరించారు .

2,455 total views, 61 views today