ప్రపంచ వృద్ధి రేటు 3శాతం

ఈ ఏడాది, వచ్చే ఏడాదిల్లో ప్రపంచ వృద్ధి రేటు 3శాతంగా కొనసాగగలదని అంచనా వేస్తున్నట్లు ఐక్యరాజ్య సమితి పేర్కొంది. అయితే ఇదే సమయంలో అభివృద్ధి సవాళ్ళకు తోడు ఆందోళన కలిగించే కొన్ని పరిణామాలో వృద్ధి రేటు దెబ్బతినే అవకాశం వుందని పేర్కొంది. ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, అవకాశాలు, 2019 శీర్షికతో సోమవారం న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో నివేదికను వెలువదరించారు. 2018లో 3.1శాతం మేరా వృద్ధిరేటు పెరిగిందని, కానీ ఇది ఈ ఏడాది,వచ్చే ఏడాదిల్లో 3శాతంగానే వుండగలదని నివేదిక తెలిపింది. అమెరికాలో వృద్ధి రేటు ఈ ఏడాది 2.5శాతమే వుండగలదని అంచనా వేశారు. 2020లో అయితే కేవలం 2శాతమే నమోదు చేసే అవకాశం వుందని నివేదిక హెచ్చరించింది. 2018లో ఆర్థిక ఉద్దీపన చర్యల ప్రభావమే ఇదని పేర్కొంది. యురోపియన్‌ యూనియన్‌కు సంబంధించి వృద్ధిరేటు 2శాతం నిలకడగా వుండగలదని అంచనా. అయితే బ్రెగ్జిట్‌ ప్రభావంతో సహా ఇతర రకాల ముప్పులు తగ్గే అవకాశం వున్నా అభివృద్ధి రేటు అంచనాలు పెరగలేదు. చైనాలో వృద్ధిరేటు 2018లో 6.6శాతం వుండగా, ఈఏడాది అది 6.3శాతానికి తగ్గింది. విధానపరమైన మద్దతు వుండడం వల్ల పాక్షికంగా వాణిజ్య ఉద్రిక్తతల ప్రతికూల ప్రభావం తగ్గిందని నివేదిక పేర్కొంది.

బ్రెజిల్‌, నైజీరియా, రష్యా వంటి దేశాలతో సహా పెద్ద ఎగుమతులు జరిపే దేశాల వృద్ధి రేటుఒక మోస్తరుగా వుండగలదని అంచనా వేశారు. అయితే ఆర్థిక వృద్ధి అనేది అంతటా ఒకేలా లేదని, ఎక్కడైతే పూర్తి స్థాయిలో అవసరమో అక్కడ లక్ష్యాన్ని చేరుకోలేకపోయిందని నివేదిక పేర్కొంది. ఆఫ్రికా, పశ్చిమాసియా, లాటిన్‌ అమెరియా, కరేబియా ప్రాంతాల్లో 2019లో తలసరి ఆదాయాలు స్తంభించిపోవడమో లేదా పెరగమో జరగవచ్చని నివేదిక పేర్కొంది.

43 total views, 1 views today