రేపు జాబ్ మేళా

మైదుకూరు పట్టణం లోని మండల పరిషత్ కార్యాలయంలో నేడు వినూత్న ఫర్టిలైజర్ కంపెనీ ఆధ్వర్యంలో సేల్స్ మెన్ ఉద్యోగాలకు రేపు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఆ కంపెనీ ప్రతినిధులు చంద్రశేఖర్ శ్రీనివాస్ లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినూత్న రైజర్స్ కంపెనీలో 30 సేల్స్ మెన్ ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు వారు తెలిపారు. ఈ ఉద్యోగాలకు పదవ తరగతి లేదా డిగ్రీ పాస్ అయి ఉండాలన్నారు. ఈ జాబ్ మేళాలో పాల్గొనే అర్హత కలిగిన నిరుద్యోగులు వారి వెంట విద్యార్హత కు సంబంధించిన సర్టిఫికెట్లు మరియు రెండు ఫోటోలు వెంట తీసుకు రావాలన్నారు. ఈ జాబ్ మేళా ను మండల అభివృద్ధి అధికారి కులయమ్మ మరియు ఎంపీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగాలకు ఎంపికైన వారికి జీతంతో పాటు రవాణా, దినసరి భత్యాలు ఉంటాయని తెలిపారు. మరిన్ని వివరాలకు 970 4916457 నెంబర్లలో సంప్రదించాలని కోరారు.

38 total views, 1 views today