నా నిర్ణయం రేపు చెబుతానుః వంగవీటి రాధా

ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణను టీడీపీ ఎమ్మెల్సీలు బచ్చుల అర్జునుడు, టి.డి.జనార్దన్‌ ఇవాళ కలిశారు. విజయవాడలోని బందరు రోడ్డులోని రాధా కార్యాలయానికి టీడీపీ నేతలు వెళ్లి.. పార్టీలో చేరాలని ఆయణ్ను ఆహ్వానించారు. ఈ భేటీ అనంతరం టీడీపీ జనార్దన్‌ మాట్లాడుతూ చంద్రబాబు ఆదేశాల మేరకు రాధాను టీడీపీలోకి ఆహ్వానించామని.. ఆయన సందేశాన్ని రాధాకు తెలియజేశామని చెప్పారు. తన నిర్ణయాన్ని చెబుతానని రాధా చెప్పారు. రేపు మీడియా సమావేశం ఏర్పాటు చేసి అన్ని వివరాలూ చెబుతానని రాధా తెలిపారు.

2,449 total views, 65 views today