గ్యాస్ కనెక్షన్ పంపిణీ తో పేదల జీవితాల్లో వెలుగులు

ఉచిత గ్యాస్ కనెక్షన్ పంపిణీతో పేదల జీవితాల్లో వెలుగును నింపే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ఉజ్వల యోజన పథకం-2 కింద గ్యాస్ కనెక్షన్లను అందజేస్తోందని భారత్ గ్యాస్ డీలర్ వెన్నెల గ్యాస్ ఏజెన్సీ యజమాని సుదర్శన్ రెడ్డి అన్నారు. ఉచిత గ్యాస్ కనెక్షన్లకు అర్హులైన దాదాపు 50 మంది మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్వాస సంబంధమైన సమస్యలను దూరం చేస్తూ పొగ రహిత ఇల్లు ఉండాలన్న ఉద్దేశంతో భారత ప్రభుత్వం ప్రజలకు ఈ పథకాలను అందిస్తోందని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు .ఆధార్, తెల్ల రేషన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్, ఫోటోలు, కుల దృవీకరణ పత్రాలతో వస్తే ఉచిత ఎల్పిజి గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంకా అర్హులైన పేదలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

2,437 total views, 61 views today