చ‌రిత్ర సృష్టించిన బ్లాక్ పాంథ‌ర్‌

లాస్ ఏంజిల్స్ : హాలీవుడ్ మూవీ బ్లాక్ పాంథ‌ర్ చ‌రిత్ర సృష్టించింది. బెస్ట్ పిక్చ‌ర్ క్యాట‌గిరీలో ఆస్కార్ అవార్డుల‌కు నామినేట్ అయిన మొద‌టి సూప‌ర్‌హీరో ఫిల్మ్‌గా గుర్తింపు తెచ్చుకుంది. హాలీవుడ్ అకాడ‌మీ ఈ యేటి ఆస్కార్ నామినేష‌న్స్‌ను మంగ‌ళ‌వారం రిలీజ్ చేసింది. ద ఫ‌వ‌రేట్‌, రోమా చిత్రాలు ప‌దేసి క్యాట‌గిరీల్లో నామినేట్ అయ్యాయి. 91వ ఆస్కార్స్‌కు నామినేట్ అయిన బెస్ట్ పిక్చ‌ర్ క్యాట‌గిరీలో బ్లాక్‌క్లాన్స్‌మెన్‌, బ్లాక్ పాంథ‌ర్‌, బెహిమియ‌న్ రాప్సాడీ, గ్రీన్ బుక్‌, ఏ స్టార్ ఈజ్ బార్న్‌, వైస్ చిత్రాలు ఉన్నాయి. ఏ స్టార్ ఈజ్ బార్న్‌, వైస్ సినిమాలు ఎనిమిదేసి క్యాట‌గిరీల‌కు నామినేట్ అయ్యాయి. బ్లాక్ పాంథ‌ర్ ఏడు, బ్లాక్‌క్లాన్స్‌మెన్ ఆరు, రాప్స‌డీ, గ్రీన్ బుక్‌లు అయిదేసి క్యాట‌గిరీల్లో నామినేట్ అయ్యాయి. బెస్ట్ డైర‌క్ట‌ర్ క్యాట‌గిరీలో స్పైక్ లీ ఎంపిక కావ‌డం విశేషం. బ్లాక్‌క్లాన్స్‌మెన్ చిత్రాన్ని అత‌ను డైర‌క్ట్ చేశాడు.

2,413 total views, 63 views today