బొంతను పెళ్లాడబోతున్న మహిళ!

ఇంగ్లాండ్‌లోని ఎక్సెటర్‌కు చెందిన 49 ఏళ్ల పస్కేల్ సెల్లిక్ అనే మహిళ ఇప్పుడు అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది.
ఫిబ్రవరి 10, మధ్యాహ్నం 2 గంటలకు తాను బొంతను పెళ్లాడనున్నానని, బంధుమిత్రులంతా వచ్చి తమను ఆశీర్వదించాలని ఆమె ఆహ్వానిస్తోంది.
ఔను.. నిజమే! ఆమె నిత్యం దుప్పటిలా కప్పుకునే బొంతతో ప్రేమలో పడింది. మరికొద్ది రోజుల్లో ఆ బొంతను పెళ్లి కూడా చేసుకోనుంది. ఇంగ్లాండ్‌లోని ఎక్సెటర్‌కు చెందిన 49 ఏళ్ల పస్కేల్ సెల్లిక్ అనే మహిళ ఇప్పుడు అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. రోజు తనకు వెచ్చదనాన్ని ఇచ్చే బొంతను పెళ్లాడబోతున్నా అంటూ తన బంధుమిత్రులను ఆహ్వానిస్తోంది.

తాను రోజు దుప్పటిలా కప్పుకునే ఆ బొంత ఇచ్చే సుఖం మగాడు కూడా ఇవ్వలేడని, దాన్ని ముట్టుకుంటే తనకు ఎంతో రొమాంటిక్‌గా అనిపిస్తుందని ఆమె చెబుతోంది. ఎంతో హాయినిచ్చే ఆ బొంత తన ఏకాంతాన్ని దూరం చేస్తుందని ఆమె తెలుపుతోంది. తన పెళ్లి రోజున వధువు ధరించే రొటీన్ డ్రస్‌లకు బదులు స్లిప్పర్, నైట్ గౌన్ ధరిస్తానని తెలిపింది.

‘‘పెళ్లి వేడుకలో నా బొంత నన్ను పెళ్లాడేందుకు ఎదురుచూస్తుంది. వెచ్చగా హత్తుకుంటుంది. ఈ బొంతను ఎంతగానో ప్రేమిస్తున్నా. మా పెళ్లికి అందరూ ఆహ్వానితులే’’ అంటూ సెల్లిక్.. పెళ్లి వేడుకను తలచుకుని తెగ మురిసిపోతోంది. ఎక్సెటర్‌లోని రౌగ్మొంట్ గార్డెన్స్‌లో ఫిబ్రవరి 10వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు తన పెళ్లి వేడుక జరగనుందని సెల్లిక్ తెలిపింది. ఆ పెళ్లి వేడుక విశేషాలు తెలుసుకోవాలంటే.. ‘వైరల్ అడ్డా’ను చూడటం అస్సలు మిస్ కాకండి.

2,415 total views, 62 views today