భారత విజయ లక్ష్యం 158

భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో న్యూజిలాండ్‌ పర్యాటక జట్టుకు 158 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత బౌలర్ల ధాటికి తొలి ఓవర్ నుంచే తడబడిన కివీస్‌ జట్టు 38 ఓవర్లలోనే 157 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది.

కివీస్‌ కెప్టెన్‌ విలియమ్సన్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. అయితే తొలి ఐదు ఓవర్లలోనే ఆతిథ్య జట్టు ఓపెనర్లను కోల్పోయింది. షమీ వేసిన రెండో ఓవర్‌ ఐదో బంతికి గప్తిల్‌ (5) ఔటవగా.. నాలుగో ఓవర్‌ మూడో బంతికి మన్రో (8) వెనుదిరిగాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన కివీస్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ క్రీజులో నిలదొక్కుకున్నాడు. రాస్‌ టేలర్‌తో కలిసి స్కోరు బోర్డును నిలబెట్టే ప్రయత్నం చేశాడు. క్రీజులో కుదురుకుంటున్న ఈ జోడీని చాహల్‌ వీడదీశాడు. చాహల్‌ వేసిన 15వ ఓవర్‌లో టేలర్‌ అతనికే క్యాచ్‌ వెనుదిరిగాడు. దీంతో విలియమ్సన్‌-టేలర్‌ భాగస్వామ్యానికి తెరపడింది.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన లాథమ్‌, నికోలస్‌, శాంట్నర్‌ సైతం తక్కువ పరుగులకే పెవిలియన్‌ చేరారు. మరోవైపు కెప్టెన్‌ విలియమ్సన్‌ ఒంటరిపోరాటం చేశాడు. ఈ క్రమంలో విలియమ్సన్‌ అర్ధశతకం నమోదు చేశాడు. వన్డేల్లో అతడికి ఇది 36వ అర్ధశతకం. అయితే 34వ ఓవర్‌లో 64 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద విలియమ్సన్‌ను కుల్‌దీప్‌ పెవిలియన్‌కు పంపించాడు. విలియమ్సన్‌(64). రాస్‌ టేలర్‌(24) మినహా కివీస్‌ ఆటగాళ్లు ఎవరూ చెప్పుకోదగ్గ పరుగులు చేయలేకపోయారు. దీంతో 38 ఓవర్లలో న్యూజిలాండ్‌ 157 పరుగులకే ఇన్నింగ్స్‌ను ముగించింది.

111 total views, 2 views today