భారత్‌తో తొలి వన్డే.. బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్

ఆస్ట్రేలియా గడ్డపై చిరస్మరణీయ విజయాలు సాధించిన భారత జట్టు మరో కీలక సమరానికి సిద్ధమైంది. న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో తొలి వన్డే బుధవారం ఆరంభమైంది. టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. స్పిన్నర్ సాంటర్న్‌తో పాటు సీమ్ బౌలింగ్ ఆల్‌రౌండర్ బ్రాస్‌వెల్‌ను తీసుకున్నట్లు విలియన్స్ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో విజయవంతమైన ఆటగాళ్లను కివీస్‌తో తుది జట్టుకు కోహ్లీ ఎంపిక చేశాడు. ప్రతిష్ఠాత్మక ప్రపంచకప్‌నకు సమయం దగ్గర పడుతుండటంతో కఠినమైన కివీస్ పరిస్థితుల్లో సిరీస్ గెలువాలని టీమిండియా పట్టుదలగా ఉంది. భారత్: రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, ధోనీ, కేదార్ జాదవ్, అంబటి రాయుడు, విజయ్ శంకర్, కుల్దీప్ యాదవ్, చాహల్, భువనేశ్వర్ కుమార్, షమీ న్యూజిలాండ్: మార్టిన్ గప్తిల్, కోలిన్ మున్రో, కేన్ విలియమ్సన్, రాస్ టేలర్, టామ్ లాథమ్, హెన్రీ నికోల్స్, సాంటర్న్, బ్రాస్‌వెల్, టిమ్ సౌథీ, ఫర్గుసన్, ట్రెంట్ బౌల్ట్

70 total views, 2 views today