సానియా వస్త్రధారణ.. ఇండియాలో ఇలా, పాక్‌లో అలా? నిజమెంతా?

ప్రముఖ బ్యాట్మింటన్ క్రీడాకారిని సానియా మీర్జా వస్త్రధారణ.. ఇండియాలో ఉన్నప్పుడు ఒకలా, పాకిస్తాన్‌లో ఉన్నప్పుడు మరోలా ఉంటుందంటూ ఇటీవల ‘వాట్సాప్’లో ఓ ఫొటో చక్కర్లు కొడుతోంది. ఈ ఫొటోలో ఒకవైపు సానియా తెల్ల టీషర్ట్, జీన్స్ ఫ్యాంట్ ధరించి ఉండగా, మరోవైపు శరీరం మొత్తం కప్పి ఉంచే హిజాబ్ ధరించింది. మొదటి ఫొటో ఇండియాలో ఉన్నప్పుడు, రెండో ఫొటో పాకిస్తాన్‌లో ఉన్నప్పుడు అని రాశారు. దాని కింద.. ఇప్పటికీ ఇండియాలో అసహనం (Intolerance) ఉన్నట్లు భావిస్తున్నారా? అని ప్రశ్నిస్తూ ఈ ఫొటోను సోషల్ మీడియాలోకి వదిలారు.
ఇటువంటి అపోహలకు పెద్దపీట వేసే సోషల్ మీడియాలో ఆ ఫొటో క్షణాల్లో వైరల్ అయ్యింది. సానియా పాకిస్తాన్ వెళ్లినప్పుడు అక్కడి సాంప్రదాయ దుస్తులు ధరిస్తుందని, ఇండియాలో మాత్రం అలా కాదంటూ ఎవరికి తోచిన విధంగా వారు ప్రచారం చేయడం మొదలుపెట్టారు.

ఇదీ నిజం: ఈ చిత్రంలో సానియా హిజాబ్ ధరించింది పాకిస్తాన్‌లో కాదు. 2006లో సౌదీ అరేబియాలో మక్కా యాత్ర సందర్భంగా ఆమె హిజాబ్ ధరించింది.

నిజనిర్ధారణ: గూగుల్ ద్వారా రివర్స్ ఇమేజ్ సెర్చ్ నిర్వహించగా రెడిఫ్ వెబ్‌సైట్‌లో ప్రచురించిన ‘Spotted! Sania Mirza in a hijab’ టైటిల్‌తో కథనం కనిపించింది. ఇందులో సానియా హిజాబ్‌ దుస్తుల్లో తన తల్లి కలిసి తీయించుకున్న ఫొటో ఉంది. ఆమె ఉమ్రాహ్ యాత్రలో ఉన్నప్పుడు ఆ ఫొటో తీసినట్లు రాసివుంది. ఈ నేపథ్యంలో సానియా పాకిస్తాన్‌లో ఉన్నప్పుడు హిజాబ్ ధరిస్తుందనే ప్రచారం అవాస్తవం అని స్పష్టమవుతోంది.

112 total views, 1 views today