వెంటిలేటర్‌పై ఉన్న క్రికెటర్‌కు పాండ్యా బ్లాంక్ చెక్

వడోదర: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న టీమిండియా మాజీ క్రికెటర్ జాకబ్ మార్టిన్‌ను ఆదుకోవడానికి ముందుకు వచ్చాడు ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా. అతని కోసం ఓ బ్లాంక్ చెక్‌ను పాండ్యా ఇచ్చాడు. సర్, మీకు ఎంత అవసరమో అంత మొత్తం రాసుకోండి. కానీ కనీసం రూ.లక్షకు తగ్గకూడదు అని పాండ్యా చెప్పినట్లు బరోడా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ సంజయ్ పటేల్ వెల్లడించారు. ఎవరినైనా సాయం అడగాలా వద్దా అని మార్టిన్ కుటుంబం డైలమాలో ఉంది. అయితే ఆ అవసరం లేకుండా క్రికెట్ సమాజం మొత్తం అతన్ని ఆదుకోవడానికి ముందుకు వస్తున్నది అని పటేల్ చెప్పారు. ఇప్పటికే జాకబ్ మార్టిన్ చికిత్స కోసం బీసీసీఐ రూ.5 లక్షలు, బరోడా క్రికెట్ అసోసియేషన్ రూ.3 లక్షలు ఇచ్చిన విషయం తెలిసిందే. మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా అతని అవసరమైన సాయం చేస్తానని ప్రకటించాడు. జహీర్‌ఖాన్, ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్, మునాఫ్ పటేల్‌లాంటి క్రికెటర్లంతా తమకు తోచిన సాయం చేశారు. 1999, సెప్టెంబర్‌లో జాకబ్ మార్టిన్ ఇండియన్ టీమ్‌లోకి వచ్చాడు.

96 total views, 1 views today