గృహిణుల శ్రమ విలువ 7 కోట్ల కోట్లట

మీ ఆవిడ ఏంచేస్తుంది? అని ఎవరైనా అడిగితే ఏమీలేదు ఊరికెనే ఉంటుంది. తను గృహిణి అంతే అనే సమాధానం సర్వసాధారణంగా వినిపిస్తుంటుంది. అంటే గృహిణి చేసే పనికి విలువ కట్టే షరాబు లేడు మరి. ప్రపంచంలో అన్నిరంగాల ఆదాయాలను లెక్కగట్టారు గానీ గృహిణుల ఆదాయం ఇప్పటివరకు సరైన మూల్యాంకనం జరుగలేదు. వంటావార్పు, పరిశుభ్రత, పిల్లల పెంపకం వంటి బహువిధ పాత్రలను గృహిణులు పోషిస్తుంటారు. అసలు కుటుంబ వ్యవస్థ అంతా గృహిణి చుట్టూ తిరుగుతుంటుంది. ఆర్థిక నిర్వహణాభారం కూడా ఆమెదే. అందుకే ఆక్స్‌ఫాం సంస్థ ఇప్పుడు ప్రపంచంలోని మొత్తం గృహిణుల శ్రమ విలువ పది లక్షల కోట్లుగా (రూ.7 కోట్ల కోట్లు) లెక్కించింది. అయితే ఇది చెల్లించని జీతం. ఈ మొత్తం యాపిల్ కంపెనీ ఆదాయం కంటే 43 రెట్లు ఎక్కువ. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఆక్స్‌ఫాం ఈ నివేదికను సమర్పించింది.

2,524 total views, 61 views today