లవ్ మ్యారేజ్ చేసుకున్న బిగ్‌బాస్ ఫేమ్, క్రికెటర్

క్రికెటర్ ఎన్‌.సి.అయ్యప్ప ఇంట్లో పెళ్లిబాజాలు మోగాయి. అయ్యప్ప, సినీనటి అను పూవమ్మలు వివాహబంధంతో ఒక్కటయ్యారు. మడికేరిలో కొడవ సంప్రదాయ పద్దతిలో వీరి వివాహం ఆదివారం (జనవరి 20న) ఘనంగా జరిగింది. బంధువులు, సన్నిహితుల సమక్షంలో అయ్యప్ప, అను పూవమ్మలు కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. బిగ్‌బాస్ షోలో పాల్గొని ఆకట్టుకున్న అయ్యప్ప.. దక్షిణాది నటి ప్రేమకు సోదరుడు.

2016 నుంచి అయ్యప్ప, అను ప్రేమించుకుంటున్నారు. అయ్యప్ప, నటి అనుల నిశ్చితార్థం 2018 మే నెలలో బెంగళూరులోని వసంతనగర్‌ కొడవ సమాజంలో జరిగింది. ఈ క్రమంలో ఇరు కుటుంబాల పెద్దలు ఆదివారం వీరి విహాహాన్ని నిశ్చయించారు. శాండల్‌వుడ్‌కు చెందిన కొందరు సెలబ్రిటీలు, కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో కొడవ సంప్రదాయం ప్రకారం వివాహ వేడుక ఆదివారం నిర్వహించారు.

కన్నడ రంజీ క్రికెటర్ అయిన అయ్యప్ప 2001లో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. 32 మ్యాచ్‌లాడి 116 వికెట్లు పడగొట్టాడు. కన్నడ బిగ్ బాస్ రియాల్టీ షో సీజన్ 3తో పాపులర్ అయ్యాడు అయ్యప్ప. నటి అను కరవ్వ, లైఫ్ సూపర్, పానీ పూరి చిత్రాలతో నటించారు. ప్రస్తుతం రెండు మూవీలలో నెగటివ్ రోల్ పోషిస్తున్నారు.

2,038 total views, 61 views today