ఆ ఇద్దరికీ రౌండ్‌ ద క్లాక్‌ సెక్యూర్టీ కల్పించాలి

జనవరి 2వ తేదీన కనకదుర్గ, బిందు అనే ఇద్దరు మహిళలు శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్న విషయం తెలిసిందే. దీంతో అయ్యప్ప సమితి ఆందోళనకారులు వారిపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాళ్లకు రక్షణ కల్పించాలని సుప్రీంలో ఓ పిటిషన్ వేశారు. దానిపై స్పందించిన కోర్టు వీరిద్దరికి 24 గంటలూ భద్రతను కల్పించాలని ఈరోజు సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ ఇద్దరు మహిళలకు రౌండ్ ద క్లాక్ సెక్యూర్టీ కల్పించాలని కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేరళ ప్రభుత్వమే ఆ ఇద్దరు మహిళలకు పూర్తి రక్షణ కల్పించాలంటూ చీఫ్ జస్టిస్ రంజన్ గగోయ్ స్పష్టం చేశారు.

125 total views, 2 views today