ప్రారంభమైన కుంభమేళా

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కుంభమేళా ఇవాళ ప్రారంభమైంది. నేటి నుంచి మార్చి 4వ తేదీ వరకు 45 రోజుల పాటు ఈ కుంభమేళా కొనసాగనుంది. పెద్ద సంఖ్యలో తరలివచ్చే కుంభమేళాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా యోగి ఆదిత్యనాథ్‌ సర్కార్ భారీ ఏర్పాట్లు చేసింది… కుంభమేళ జరగనున్న ప్రయాగ్‌రాజ్‌కు ప్రత్యేకించి రూ.2000 వేల కోట్లతో కేటాయించి సరికొత్తగా ముస్తాబు చేశారు అధికారులు.. ప్రపంచం నలుమూలల నుంచీ వచ్చే యాత్రికులు, భక్తులకు ఇబబ్బందుల ఏకుండా ఏర్పాట్లు చేశారు. 192 దేశాల నుంచి దాదాపు 12 కోట్ల మంది యాత్రికులు వస్తారని అంచనా ఉండగా… వీటి నిర్వహణకు రూ.2,800 కోట్లు కేటాయించింది యూపీ సర్కార్. దీని కోసం 250 కిలోమీటర్ల పొడవైన రోడ్లు, 22 పంటూన్ వంతెనల్ని నిర్మించారు. 40 వేల ఎల్ఈడీ బల్బుల్ని అమర్చారు. ఈసారి కుంభమేళాకి అత్యంత కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నారు.

40 total views, 1 views today