కూలిన శ్రీశైలం మల్లన్న ఆలయ ప్రాకారం

కర్నూలు జిల్లాలోని శ్రీశైలం మల్లికార్జునస్వామి ఆలయ ప్రాకారం శనివారం రాత్రి స్వల్పంగా కూలిపోయింది. ప్రస్తుతం భ్రమరాంబదేవి ఆలయ నైరుతి భాగంలో ప్రాకారం ఎత్తు పెంచే పనులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో అధిక రాళ్ల బరువు కారణంగా ప్రాకారం కూలిపోయింది. అయితే పది అడుగుల మేర స్వల్పంగా కూలింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

51 total views, 1 views today