టోల్‌ రద్దు చేసినా వసూలు చేస్తున్న సిబ్బంది

సంక్రాంతి పండగ సందర్భంగా జాతీయ రాహదారులపై టోల్‌గేట్ల వద్ద రుసుములు రద్దు చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినప్పటికీ టోల్‌గేట్‌ సిబ్బంది టోల్‌ వసూలు చేస్తున్నారు. పండుగకు ప్రజల ప్రయాణాల దృష్ట్యా… 13, 16 తేదీల్లో జాతీయ రహదారులపై టోల్‌గేట్ల వద్ద రుసుముల వసూళ్లను రద్దుచేస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి తెలిపారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు, జాతీయ రహదారుల అధికారులతో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అయితే ఈ ఆదేశాలను టోల్‌ సిబ్బంది పాటించడం లేదు.

పంతంగి, కొర్లపహాడ్‌, చిల్లకల్లు టోల్‌గేట్ల వద్ద రుసుములు వసూలు చేస్తున్నారు. తమకు రద్దు ఆదేశాలు రాలేదంటూ చెబుతున్నారు. ప్రభుత్వ ఆదేశాలు రాష్ట్రరహదారులకే పరిమితం అని.. ఎన్‌హెచ్‌ఐ నుంచి ఆదేశాలు రాలేదని టోల్‌ప్లాజాల నిర్వాహకులు చెబుతున్నారు.

34 total views, 1 views today