కడప జైలుకు తాడిపత్రి మట్కా కేడీలు

 కడప పోలీసులపై దాడి చేసి తీవ్రంగా గాయపరచి, వాహనాన్ని దగ్ధం చేసిన తాడిపత్రి మట్కా కేడీలను శనివారం ప్రొడ్యూస్డ్‌ ఫర్‌ ట్రయల్స్‌ (పిటి) వారెంట్‌ పై కడప కేంద్ర కారాగారానికి తరలించారు. ప్రధాన నిందితుడు రషీద్‌ సహా 12 మందిని జైలుకు పంపారు. విధుల నిమిత్తం వెళ్లిన పో లీసులపై దాడులు చేస్తే చట్టపరంగా పోలీసు చర్యలు ఎలా ఉంటాయో కడప పోలీసులు చే సి చూపించారు. పోలీసు వర్గాల ద్వారా అంది న సమాచారం మేర.. గత నెల 21వ తేదీన మట్కా కింగ్‌లుగా పేరొందిన కడపకు చెందిన మట్కారామయ్య, తాడిపత్రికి చెందిన సాదిక్‌వల్లి సహా 10 మంది మట్కా నిర్వాహకులను కడప అర్బన్‌ ఇన్స్‌పెక్టర్‌ హమీద్‌ఖాన్‌ నేతృత్వంలో అరెస్టు చేశారు. వారి నుంచి రూ.25లక్షలు నగదు స్వా ధీనం చేసుకున్నారు. అరెస్టు అయిన వారిలో ఒకరిచ్చిన సమాచారం మేర తాడిపత్రికి చెంది న రషీద్‌ పెద్దస్థాయిలో మట్కా కేంద్రాలను నిర్వహిస్తున్నట్లు తెలుసుకున్నారు.

తాడిపత్రికి చెందిన రషీద్‌తో పాటు మరికొందరిపై కడపలో కేసులున్నట్లు గుర్తించారు. దీంతో రషీద్‌ను అదుపులోకి తీసుకుని విచారించేందుకు డిసెంబరు 30న కడప అర్బన్‌ ఇన్స్‌పెక్టర్‌ హమీద్‌ఖాన్‌, కానిస్టేబుళ్లు నరేంద్రారెడ్డి, ప్రదీ్‌పకుమార్‌, ప్రసాద్‌లతో కలిసి తాడిపత్రికి వెళ్లారు. రషీద్‌ తన ఇంట్లో ఉన్నట్లు గుర్తించి లోపలికి వెళ్లారు. దీంతో రషీద్‌ అనుచరులు పెద్ద ఎత్తున వచ్చి కడప పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తాము పోలీసులమని చెబుతున్నా ఒక్కసారిగా కర్రలు, రాడ్లు, రాళ్లతో దాడి చేశారు. ఈ దాడి లో ఇన్స్‌పెక్టర్‌ హమీద్‌ఖాన్‌, కానిస్టేబుళ్లు నరేంద్రారెడ్డి, ప్రదీ్‌పకుమార్‌లు తీవ్రంగా గాయపడ్డారు. వారొచ్చిన వాహనాన్ని దగ్ధం చేశారు. తాడిపత్రి పోలీసుల ఎదుటే దాడి జరగడం చ ర్చనీయాంశమైంది. కాగా అదే రోజు రషీద్‌, అ తని సోదరుల సహా 20 మందిపై కేసు నమో దు చేసి కొందరిని అరెస్టు చేశారు. పోలీసులపై దాడి జరిగిందని తెలియగానే జిల్లా పోలీసు యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎస్పీ అభిషేక్‌ మహంతి చట్ట, న్యాయపరమైన చర్యలకు సమాయత్తమయ్యారు.

12 మందిపై పాత కేసులు

అరెస్టు అయిన వారిలో దాడికి సంబంధించి ప్రధాన నిందితుడైన రషీద్‌తో పాటు మరో 11 మందిపై కడపలో పాత కేసులున్నట్లు పోలీసు లు గుర్తించారు. దీంతో శనివారం తాడిపత్రి కో ర్టులో పిటి వారెంట్‌ వేసి 12 మందిని కడపకు తీసుకొచ్చారు. సీఐలు, ఎస్‌ఐలు, ఆర్‌ఎ్‌సఐలు సహా దాదాపు వంద మంది సిబ్బంది వెళ్లి వారి ని తీసుకొచ్చి కడప కేంద్ర కారాగారానికి తరలించారు. కడపకు తీసుకొచ్చిన వారిలో రషీద్‌, నౌషాద్‌, జాన్సన్‌, ఇలియాస్‌, అర్జున, శివకుమార్‌, ఖాజా, వంశిక్రిష్ణ, మసూద్‌, వలి, సుధీ ర్‌, జావిద్‌లున్నారు.

కస్టడీకి తీసుకునే అవకాశం!

చట్టపరమైన చర్యలు తీసుకున్న జిల్లా పోలీసు యంత్రాంగం న్యాయపరంగా కోర్టు ద్వారా నిందితులను విచారించేందుకు కస్టడీలోకి తీ సుకునే చర్యలకు సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. విచారణలో విస్తరించిన మట్కాని ర్వహణపై పోలీసులకు మరింత సమాచారం లభించే అవకాశమున్నట్లు భావిస్తున్నారు. పోలీసులపై దాడులు చేస్తే వారి చర్యలు ఎంత క ఠినంగా ఉంటాయో నేర స్వభావం ఉన్నవారికి స్పష్టంగా తెలియవచ్చిందని పోలీసు వర్గాలు అంటున్నాయి.

25 total views, 1 views today