రేపు నారావారిపల్లికి సిఎం చంద్రబాబు

సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు (సోమవారం) చిత్తూరు జిల్లా నారావారిపల్లికి వెళ్లనున్నారు. సంక్రాంతి పండుగను సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులతో, గ్రామస్తులతో కలిసి జరుపుకోనున్నారు. పండుగ సందర్భంగా ఇప్పటికే చంద్రబాబు కుటుంబ సభ్యులు నారావారిపల్లికి చేరుకున్నారు. మూడు రోజుల పాటు చంద్రబాబు నారావారిపల్లిలోనే ఉండే అవకాశం ఉంది.

30 total views, 1 views today