వైఎస్సార్‌ ఘాట్‌లో తండ్రికి జగన్మోహన్‌ రెడ్డి నివాళులు

”రాష్ట్ర ప్రజలు మా కుటుంబంపై చూపుతున్న ఆదరాభిమానాలను మేం ఎప్పటికీ మరిచిపోలేం. వారందరికీ మా కుటుంబం వెన్నుదన్నుగా నిలుస్తుంది” అని వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అన్నారు. ప్రజాసంకల్ప యాత్ర చేపట్టిన జగన్‌ సుమారు 14 నెలల తరువాత తిరిగి పులివెందుల వచ్చారు. దీనితో ఆయన ఇంటి నుంచి సీఎ్‌సఐ చర్చి వరకూ ప్రజలు పెద్ద ఎత్తున కూడారు. సీఎ్‌సఐ చర్చిలో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. అనంతరం ఇడుపులపాయకు బయలుదేరి వెళ్లారు. తల్లి విజయలక్ష్మి, సోదరి షర్మిల, సతీమణి భారతి, మాజీ ఎంపీ వైఎస్‌ అవినా్‌షరెడ్డి తదితర కుటుంబ సభ్యులు, నేతలతో కలిసి వైఎస్సార్‌ ఘాట్‌ వద్దకు చేరుకున్నారు. తండ్రి సమాధికి పూలమాల వేసి నివాళులర్పించారు. రెండు నిమిషాలు మౌనం పాటించారు.అప్పటికే అక్కడకు చేరుకున్న అనంతపురం జిల్లా మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి, పలువురు మండల స్థాయి నేతలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ జగన్‌ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

21 total views, 1 views today