అప్పు చెల్లించకుండా మొహం చాటేసిన బ్యాంకు మేనేజర్‌పై కేసు

తీసుకున్న అప్పు చెల్లించకుండా మొహం చాటేసిన బ్యాంకు మేనేజర్‌పై ఠాణాలో కేసు నమోదైంది. బంజారాహిల్స్‌ పోలీసుల కథనం ప్రకారం.. బంజారాహిల్స్‌ రోడ్డు నంబరు 12లోని ఎమ్మెల్యే కాలనీలో నివసించే ముత్యాల ఆనంద్‌కుమార్‌ విశ్రాంత ఉద్యోగి. ఆయనకు ఎమ్మెల్యే కాలనీలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఖాతా ఉండేది. బ్యాంకు మేనేజర్‌ నల్ల హన్మంతరావు(42)తో అతనికి పరిచయం ఏర్పడింది. తనకు అప్పు కావాలంటూ ఆనంద్‌కుమార్‌ దగ్గర హన్మంతరావు రూ.10 లక్షలు తీసుకున్నాడు. తిరిగి చెల్లించాలని కోరితే ఒక సారి చెల్లని చెక్కు ఇచ్చాడు. ఆ తర్వాత రూ.10 లక్షలకు ప్రామిసరి నోటు రాసిచ్చి.. డబ్బు ఇవ్వాల్సిన గడువు ముగిసేదాకా రోజుకో సాకు చెప్పాడు. తాజాగా చరవాణికీ అందుబాటులోకి రావడం లేదు. ఆనంద్‌కుమార్‌ బంజారాహిల్స్‌ పోలీసులకు శుక్రవారం రాత్రి ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్‌ పోలీసులు నల్ల హన్మంతరావుపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు

28 total views, 1 views today