రూ.999కే.. 1000జీబీ డేటా!

న్యూఢిల్లీ: ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ తన బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారుల కోసం బంపర్ ఆఫర్ ప్రకటించింది. రిలయన్స్ జియో గిగాఫైబర్ పోటీని తట్టుకునేందుకు, ప్రస్తుత యూజర్లను ఆకట్టుకునేందుకు కొత్త ఆఫర్ తీసుకొచ్చింది. ఎంపిక చేసిన సర్కిళ్లలో బ్రాడ్‌బ్యాండ్ సబ్‌స్ర్కైబర్ల కోసం బోనస్ డేటా ఇచ్చేందుకు ప్లాన్‌లో మార్పులు చేసింది. ప్రముఖ నెట్‌వర్క్ ప్రొవైడర్ ఎయిర్‌టెల్ 1టీబీ(1000జీబీ) బోనస్ డేటాను ఈ ఏడాది మార్చి 31 వరకు యూజర్లకు అందుబాటులో ఉంచింది.

బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్‌లో భాగంగా రూ.799తో పాటు అంతకన్నా ఎక్కువ విలువతో రిఛార్జి చేసుకున్న వారు బోనస్ డేటాకు అర్హులు. ఎయిర్‌టెల్ వీ-ఫైబర్ సేవలను అందిస్తున్న పట్టణాల్లో ఆఫర్ వినియోగించుకోవచ్చు. బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ కింద రూ.799 రీఛార్జ్‌తో రూ.500జీబీ బోనస్ డేటాను యూజర్లు పొందవచ్చు. రూ.999, రూ.1,299, రూ.1,999లో రీఛార్జి చేసుకున్న వారికి 1000జీబీ బోనస్ డేటా సబ్‌స్ర్కైబర్లకు అందుబాటులో ఉంటుందని ఎయిర్‌టెల్ వెల్లడించింది. రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్ సంస్థ‌ల‌కు పోటీగా ఎయిర్‌టెల్ కొత్త ఆఫ‌ర్ల‌ను ప్ర‌వేశ‌పెడుతోంది.

61 total views, 2 views today