రిటైర్మెంట్ తర్వాత బ్యాట్‌ ముట్టుకోను: కోహ్లీ

అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా ఏబీ డివిలియర్స్, మెల్‌కలమ్‌ తదితర హిట్టర్లు ప్రైవేట్‌ లీగ్స్‌లో కెరీర్‌ని కొనసాగిస్తున్నారు. కానీ.. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం.. తాను రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత బ్యాట్‌ ముట్టుకోనని స్పష్టం చేశాడు. ఆస్ట్రేలియాతో శనివారం ఉదయం 7.50 గంటలకి తొలి వన్డే జరగనున్న నేపథ్యంలో ఈరోజు మీడియాతో విరాట్ కోహ్లీ‌ మాట్లాడుతుండగా రిటైర్మెంట్ ప్రస్తావన వచ్చింది. దీంతో.. పైవిధంగా భారత్ కెప్టెన్ స్పందించాడు.

‘రిటైర్మెంట్ తర్వాత ప్రైవేట్ లీగ్స్‌లో ఆడటం ద్వారా భవిష్యత్ మారిపోతుందని నేను అనుకోవట్లేదు. ఇప్పటికే నేను చాలా క్రికెట్ ఆడేశాను. ఇంకా ఆడే అవకాశముంది. అందుకే రిటైర్మెంట్ తర్వాత మళ్లీ ఆడాలనే ఆలోచన లేదు. ఒక్కసారి ఆటకి వీడ్కోలు పలికితే ఇక మళ్లీ బ్యాట్ ముట్టుకోను’ అని విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు.

2015 ప్రపంచకప్ తర్వాత న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ మెక్‌కలమ్ అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే.. ఆ తర్వాత అతను ఐపీఎల్, బీపీఎల్ తరహా ప్రైవేట్ లీగ్స్‌లో ఆడుతూ బిజీగా గడుపుతున్నాడు. మరోవైపు 2018లో ఐపీఎల్ సీజన్ ముగిసిన తర్వాత రిటైర్మెంట్ ప్రకటించిన ఏబీ డివిలియర్స్ ప్రస్తుతం మెక్‌కలమ్ తరహాలోనే ప్రైవేట్ లీగ్స్‌లో సత్తాచాటుతున్నాడు.

46 total views, 1 views today