ఆసీస్‌తో తొలి వన్డేకి హార్దిక్, రాహుల్‌పై వేటు

ఆస్ట్రేలియాతో శనివారం ఉదయం నుంచి ప్రారంభంకానున్న తొలి వన్డే‌‌కి భారత్ దాదాపు తుది జట్టుని ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. గాయం నుంచి ఇటీవల కోలుకుని జట్టులోకి పునరాగమనం కోసం ఎదురుచూస్తున్న హార్దిక్ పాండ్యాపై వేటు వేసిన టీమిండియా మేనేజ్‌మెంట్.. ప్రత్యామ్నాయ ఓపెనర్‌ కేఎల్ రాహుల్‌ని అసలు పరిగణలోకి కూడా తీసుకోలేదట. దీంతో.. ఈ ఇద్దరు క్రికెటర్లూ రేపు తొలి వన్డే‌లో ఆడే అవకాశాలు లేవని మీడియాలో కథనాలు వస్తున్నాయి. మరోవైపు.. ఇటీవల ‘కాఫీ విత్ కరణ్’‌ టాక్ షోలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకే వీరిని టీమిండియా మేనేజ్‌మెంట్ పక్కనపెట్టబోతున్నట్లు వినికిడి.

ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ కోసం సెలక్టర్లు ప్రకటించిన భారత వన్డే జట్టు ఇదే..!

విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, అంబటి రాయుడు, దినేశ్ కార్తీక్, కేదార్ జాదవ్, మహేంద్రసింగ్ ధోని (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, కుల్దీప్ యాదవ్, చాహల్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్

హార్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్‌‌ని పక్కనపెడితే.. తొలి వన్డే‌కి భారత్ జట్టు ఇలా ఉండే అవకాశం ఉంది. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శిఖర్ ధావన్.. ఆ తర్వాత మూడో స్థానంలో విరాట్ కోహ్లీ, నాలుగులో అంబటి రాయుడు, ఆ తర్వాత దినేశ్ కార్తీక్ ,కేదార్ జాదవ్, మహేంద్రసింగ్ ధోనీ బ్యాటింగ్ ఆర్డర్‌లో వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక బౌలింగ్ విభాగంలో భువనేశ్వర్, ఖలీల్ అహ్మద్, మహ్మద్ షమీ లేదా సిరాజ్‌తో పాటు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఉండే అవకాశం ఉంది.

40 total views, 1 views today