పాండ్య ‘కాఫీ’ ఎఫెక్ట్.. ఆ ఎపిసోడ్ వీడియో మాయం

క్రికెటర్లు హార్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్‌లతో నిర్వహించిన ‘కాఫీ విత్ కరణ్’ షో వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ షోలో అమ్మాయిలు, కండోమ్‌లంటూ పాండ్య చేసిన బోల్డ్ కామెంట్స్‌పై బీసీసీఐ కన్నెర జేసింది. ఈ వివాదం రోజు రోజుకీ ముదురుతుండటంతో.. హాట్ స్టార్ వెబ్‌సైట్ నుంచి ఆ ఎపిసోడ్ వీడియోను తొలగించారు. ‘కాఫీ విత్ కరణ్’ షోలో తాను చేసిన వ్యాఖ్యల పట్ల హార్దిక్ ఇప్పటికే సారీ చెప్పిన సంగతి తెలిసిందే.

షో ద్వారా ఎవరి మనసునైనా గాయపరిస్తే క్షమించమని కోరుతున్నా అని హార్దిక్ పాండ్య ట్వీట్ చేశాడు. ఎవర్నీ కించపరిచే ఉద్దేశంతో, హర్ట్ చేయాలని నేను ఆ వ్యాఖ్యలు చేయలేదని చెప్పుకొచ్చాడు.

హార్దిక్ సారీ చెప్పినప్పటికీ బీసీసీఐ మాత్రం కరిగిపోలేదు. పాండ్య, కేఎల్ రాహుల్‌పై రెండు వన్డేల నిషేధం విధించాలని కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ చీఫ్ వినోద్ రాయ్ సిఫారసు చేసిన సంగతి తెలిసిందే.

42 total views, 1 views today