నర్సుల నిర్లక్ష్యం.. కడుపులోనే తల..

జైపూర్ : ఈ వార్త చదివితే ఒళ్లు గగుర్పాటు కావాల్సిందే! ఇద్దరు నర్సులు చేసిన నిర్లక్ష్యానికి ఒక బిడ్డ ప్రాణాలు కోల్పోయింది. ఆ బిడ్డ తల్లి మృత్యువుతో పోరాడుతోంది. రాజస్థాన్ లోని రామ్ గర్హ్ ప్రభుత్వ ఆస్పత్రికి జనవరి 6వ తేదీన ప్రసవం కోసం ఓ గర్భిణి వచ్చింది. ఆమెకు ఇద్దరు మగ నర్సులు డెలివరీ చేశారు. అయితే శిశువును గట్టిగా బయటకు లాగడంతో.. రెండు భాగాలుగా విడిపోయింది. తల్లి కడుపులోనే తల భాగం ఉండిపోగా, మొండెం బయటకు వచ్చింది. దీంతో ఏమి తెలియనట్లుగా ఆ మొండెం భాగాన్ని మార్చురీలో ఉంచి.. మెరుగైన చికిత్స కోసం జైసల్మేర్ ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. ఇక బాధితురాలిని తీసుకోని ఆమె కుటుంబ సభ్యులు జైసల్మేర్ వెళ్లగా అసలు విషయం వెలుగు చూసింది. అక్కడున్న డాక్టర్లు బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించి.. ఆమె శరీరంలో ఉన్న బిడ్డ తలను గుర్తించారు. అనంతరం శస్త్ర చికిత్స నిర్వహించి శిశువు తలను బయటకు తీశారు. అటు బిడ్డ ప్రాణాలు కోల్పోగా, తల్లి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటనపై బాధితురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

37 total views, 1 views today