దోషిగా తేలిన గుర్మిత్ సింగ్.. ఈ 17న శిక్ష విధింపు

పాట్నా: జర్నలిస్ట్ రామచంద్ర ఛత్రపతి హత్య కేసులో గుర్మిత్ రామ్ రహీంతో పాటు మరో ముగ్గురిని సీబీఐ ప్రత్యేక కోర్టు దోషులుగా తేల్చింది. కేసులో ఈ నెల 17వ తేదీన శిక్ష తీర్పును వెలవరించనున్నట్లు పేర్కొంది. గుర్మిత్ సింగ్ మహిళల వేధింపుల గురించి జర్నలిస్ట్ రామచంద్ర 2002లో ప్యూర్ సచ్ఛ్ న్యూస్ పేపర్‌లో వార్తా కథనాలు రాశాడు. ఈ వార్తా ప్రచురణ అనంతరం అతడు హత్యకు గురయ్యాడు. దర్యాప్తులో గుర్మిత్ సింగ్ ప్రధాన కారకుడిగా ఉన్నట్లు తేలింది. కేసు విచారణ చేపట్టిన పంచకుల సీబీఐ ప్రత్యేక కోర్టు జర్నలిస్ట్ హత్య కేసులో గుర్మిత్ సింగ్‌తో పాటు మరో ముగ్గురిని దోషులుగా తేల్చుతూ నేడు తీర్పును వెలువరించింది. కాగా తన ఇద్దరు మహిళా అనుచరులను అత్యాచారం చేసిన కేసులో గుర్మిత్‌సింగ్ ఇప్పటికే జైలు జీవితం గడుపుతున్నాడు.

33 total views, 1 views today