పబ్‌జి గేమ్ ప్లేయర్లకు రూ.కోటి నజరానా

పబ్‌జి గేమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారత్‌లో ఇదొక హాటెస్ట్ సెన్సేషన్. ఈ గేమ్ యువతను కట్టి పడేస్తోంది. ఇప్పుడు పబ్‌జి గేమ్ ప్లేయర్లకు తీపి కబురు అందింది. పబ్‌జి మొబైల్ ఇండియా సిరీస్ 2019 షెడ్యూల్ వెల్లడైంది. దీనికి ఒప్పొ స్పానర్‌ చేస్తోంది. పబ్‌జి మొబైల్ క్యాంపస్ చాంపియన్‌షిప్ 2018 విజయవంతమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మళ్లీ ఇప్పడు ఒప్పొ, టెన్‌సెంట్ కంపెనీలు పబ్‌జి మొబైల్ ఇండియా సిరీస్ 2019కు శ్రీకారం చుట్టాయి. గత చాంపియన్‌షిప్‌తో పోలిస్తే ప్రస్తుత టోర్నమెంట్‌లో రివార్డ్ మనీ రెట్టింపు అయ్యింది.

టెన్‌సెంట్ గేమ్స్ తాజాగా ఒప్పొ పబ్‌జి మొబలై్ ఇండియా సిరీస్ 2019ను ప్రకటించింది. ఇదొక ఇ-స్పోర్ట్స్ టోర్నమెంట్. భారత్‌లోని పబ్‌జి గేమ్ ప్లేయర్లు అందరూ ఇందులో పాల్గొనవచ్చు. అయితే ప్లేయర్ లెవెల్ 20కి పైనుండాలి. ఈ పోటీలో గెలిచిన టీమ్‌లు రూ.కోటి బహుమతి లభిస్తుంది. ప్రైజ్ మనీలో నగదు, ఒప్పొ ఫోన్లు కలిసి ఉంటాయి.

పబ్‌జి మొబైల్ ఇండియా సిరీస్ 2019 గ్రాండ్ ఫినాలే మార్చి 10న జరుగుతుంది. టాప్‌లో ఉన్న టీమ్‌కు రూ.30 లక్షల బహుమతి లభిస్తుంది. రెండో స్థానంలోని టీమ్ రూ.10 లక్షలు, మూడో స్థానంలోని టీమ్ రూ.5 లక్షలు గెలుచుకుంటాయి. వీరితోపాటు టాప్ 20లో మిగిలిన వారికి కూడా బహుమతులు ఉంటాయి. దీనికితోడు ఆయా కేటగిరిల్లో బెస్ట్ ప్లేయర్‌కు రూ.50,000 బహుమతి లభిస్తుంది. ఎంవీపీ, ఎక్స్‌టర్మినేటర్, రిడీమర్, లాంగ్ రేంజర్ వంటి పలు విభాగాలున్న విషయం తెలిసిందే.

31 total views, 1 views today