ఫోన్లో బొద్దింకలు.. చూస్తే షాక‌వుతారు

మొబైల్ ఫోన్లు వచ్చిన తర్వాత ల్యాండ్ లైన్ ఫోన్లను అంతా మరిచిపోయారు. అయితే, ల్యాండ్‌లైన్ ఫోన్లతో అనుబంధం ఉన్నవాళ్లు మాత్రం వాటిని ఇంకా వినియోగిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మరికొందరు ప్రత్యామ్నయంగా వాడుతున్నారు. సెల్ ఫోన్ల తరహాలో బ్యాటరీలు మార్చే అవసరం లేకపోవడంతో ల్యాండ్ లైన్ ఫోన్లను తెరిచి చూసే అవకాశం రాదు. కేవలం రిపైర్ వస్తేనే వాటిని తెరిచి మరమ్మతులు చేస్తారు. దీంతో అందులోకి ఏ కీటకాలు దూరినా పెద్దగా తెలీదు.

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఓ జంటకు తమ ల్యాండ్ లైన్ ఫోన్ పనిచేయడంలేదని కస్టమర్‌కేర్‌కు ఫిర్యాదు చేశారు. ఫోన్ నుంచి ఏవో శబ్దాలు వస్తున్నాయని తెలిపారు. దీంతో ఫోన్ మెయింటెనెన్స్ వర్కర్ వచ్చి దాన్ని తెరిచి చూసి షాకయ్యాడు. అందులో గుట్టలుగుట్టలుగా బొద్దింకలు ఉన్నాయి. అందులో అవన్నీ చనిపోయి ఉన్నాయి. మెయింటెనెన్స్ వర్కర్ ఇదంతా వీడియో తీసి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది.

926 total views, 1 views today