బీజేపీతో పొత్తు పెట్టుకోం

భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ తేల్చిచెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ తనను అటల్ బీహారి వాజపేయితో పోల్చుకోవడం సరికాదన్నారు. మోదీ రాష్ర్టాల హక్కులను కాలరాస్తున్నాడని స్టాలిన్ నిప్పులు చెరిగారు. తమిళనాడుకు మోదీ చేసేందిమీ లేదన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని పొత్తు ప్రమాదకరమైనది అని ఆయన పేర్కొన్నారు. ప్రధాని మోదీలా వాజపేయి ఒంటరి నిర్ణయాలు తీసుకోలేదు. నిర్ణయాత్మక రాజకీయ నిర్ణయాలు తీసుకున్న వాజపేయికి గతంలో తాము మద్దతిచ్చామని స్టాలిన్ గుర్తు చేశారు.

27 total views, 1 views today