సుప్రీం ఆదేశాలను కూడా ఖాతరు చేయడం లేదు

అలోక్‌ వర్మను కేంద్రం కావాలనే పదవి నుంచి తప్పించిందని, సుప్రీం ఆదేశాలను ఖాతరు చేయకుండా కేంద్రం నియంతలా వ్యవహరిస్తున్నది అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. రాఫెల్‌ కుంభకోణంలో వాస్తవాలు వెలుగు చూస్తాయన్న భయంతోనే కేంద్రం ప్రవర్తిస్తుందని ఆయన అన్నారు. వ్యవస్థలన్నింటినీ మోది ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తున్నదని విమర్శించారు. రాష్ట్రంలో విలువైన భూములను తమ పార్టీ వారికి కట్టబెట్టడానికి భూముల వ్యవహారంతో పాటు, రెవెన్యూ చట్టాల్లో మార్పులతో ఉత్తర్వులు పరిష్కరించాలని కోరతామని తెలిపారు. సియం నుంచి సరైన స్పందన రాకపోతే సిపిఐ, సిపిఎం పార్టీలు జనసేనతో కలిసి ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు.

21 total views, 1 views today