‘వినయ విధేయ రామ’ రివ్యూ

చిత్రం: వినయ విధేయ రామ
నటీనటులు: రామ్‌చరణ్‌, కియారా అడ్వాణీ, వివేక్‌ ఒబెరాయ్‌, ప్రశాంత్‌, ఆర్యన్‌రాజేష్‌, స్నేహ, మధుమిత, రవి వర్మ, హిమజ, హరీష్‌ ఉత్తమన్‌, మహేష్‌ మంజ్రేకర్‌, మధునందన్‌ తదితరులు
దర్శకత్వం : బోయపాటి శ్రీను
నిర్మాతలు: దానయ్య
మ్యూజిక్ : దేవి శ్రీ

సంక్రాంతికి పెద్ద హీరోల సందడి ఉందంటే ఆ మజానే వేరు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా సంక్రాంతి సినిమాలు థియేటర్స్ వద్ద సందడి చేస్తున్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్ కథానాయకుడు, పేట చిత్రాలు సందడి షురూకాగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’ చిత్రం భారీ అంచనాల నడుమ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

కథ :

నలుగురు అనాధ పిల్లలకు మరో అనాధగా ఒక చిన్నబాబు వాళ్ళకి దొరుకుతాడు. వారు ఐదుగురు ఒకే రక్తం పంచుకుని పుట్టిన అన్నదమ్ముల్లా పెరుగుతారు. ఓ అందమైన ఫ్యామిలీ..ఐదుగురు అన్నదమ్ములతో చాల సరదాగా ఉంటుంది..అందరి కన్నా చిన్నవాడు రామ్ కొణెదల (రామ్ చరణ్). చిన్నవాడు కావడం తో అందరికి చాల ఇష్టం..పెద్దన్న భువన్ కుమార్ (ప్రశాంత్ ) ఎన్నికల అధికారిగా పనిచేస్తుంటాడు. ఆయన పనిచేసే ప్రాంతంలో జరిగే ఉప ఎన్నికల్లో పరశురాం (ముఖేష్ రుషి) చేసే అన్యాయాలకు అడ్డు పడతాడు. దీంతో పగ పెంచుకున్న పరశురాం ..భువన్ ఫ్యామిలీ ని టార్గెట్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది..? రామ్ కొణెదల తన ఫ్యామిలీ ని ఎలా కాపాడుకోగలిగాడు..? మున్నాభాయ్‌ (వివేక్ ఒబెరాయ్‌) , రామ్ కొణెదల ఫ్యామిలీ కి సంబంధం ఏంటి..? అసలు మున్నాభాయ్‌ ఎవరు..? ఈయన కు కథ కు లింక్ ఏంటి అనేది మీరు తెరపై చూడాల్సింది.

విశ్లేష‌ణ‌ :

ఈ చిత్రం రెండు ఛాయాల్లో సాగుతుంది. ఓ వైపు పూర్తి ఎంట‌ర్‌టైన్‌మెంట్‌గా సాగితే, మరోవైపు త‌న అన్న‌కు, కుటుంబానికి జ‌రిగిన అన్యాయంపై ఒక త‌మ్ముడు చేసే పోరాటం ఇందులో కనిపిస్తుంది. బోయ‌పాటి చిత్రాల్లో స‌హ‌జంగా యాక్ష‌న్ మోతాదు ఎక్కువ‌గా ఉంటుంది. అదే స‌మ‌యంలో కుటుంబ బంధాలు, అనుబంధాల‌ను చూపిస్తారు. ఈసారి కూడా అదే ఫార్ములాను ఆయ‌న ఎంచుకున్నారు. అయితే, ఈ సినిమా కోసం అవి రెండూ ఇంకాస్త పెరిగాయి. ఒక కుటుంబంలో అన్నావ‌దిన‌లు, వారి పిల్ల‌ల మ‌ధ్య ఎలాంటి వాతావ‌ర‌ణం ఉంటుందో అదంతా తెర‌పై చాలా అందంగా, రిచ్‌గా చూపించారు. ఆయా స‌న్నివేశాల‌న్నీ ఒక హిందీ సినిమా చూసిన ఫీలింగ్ క‌లుగుతుంది. ప్ర‌తి ఫ్రేమ్‌లోనూ ప‌ది, ప‌దిహేను మంది క‌న‌ప‌డ‌తారు. ఇక యాక్ష‌న్ ఎపిసోడ్ల‌కు వ‌చ్చేస‌రికి మ‌రో స్థాయిలో చూపించే ప్ర‌య‌త్నం చేశారు బోయ‌పాటి. అటు ఫ్యామిలీ ఆడియ‌న్స్‌కు, ఇటు మాస్ ప్రేక్ష‌కుల‌కు న‌చ్చేలా ఉండాల‌న్న‌ది బోయ‌పాటి ప్ర‌య‌త్నంగా క‌నిపిస్తుంది. కియారా అడ్వాణీతో కొన్ని స‌న్నివేశాలు, ఆఫీస్‌లో జ‌రిగే ఎపిసోడ్ల‌లో ఎంట‌ర్‌టైన్‌మెంట్ అల‌రిస్తుంది. అయితే, ఈ యాక్ష‌న్ ఎపిసోడ్ల మూలంగా క‌థ బాగా న‌లిగిపోయింది. కొన్ని యాక్ష‌న్ సీక్వెన్స్ మ‌ధ్య క‌థ‌ను పేర్చుకుంటూ వెళ్లాడేమో అనిపిస్తుంది. బోయ‌పాటి శైలిలోనే క‌థ ప్రారంభ‌మై చాలా మాసీగా సాగుతుంది. హీరోయిజం ఎలివేట్ చేసే స‌న్నివేశాలు ప‌తాక స్థాయిలో ఉంటాయి. యాక్ష‌న్ సీక్వెన్స్ ముందు వ‌చ్చే స‌న్నివేశాల్లో భావోద్వేగాలు బాగా పండించాడు. విరామం వ‌ర‌కూ ఈ సినిమాలో క‌థే ఉండదు. కానీ, దాని ముందు వ‌చ్చే స‌న్నివేశాలు మాస్‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంటాయి.

ప్లస్‌ పాయింట్స్‌ :

  • యాక్షన్ పార్ట్
  • రామ్ చరణ్ యాక్టింగ్
  • మాస్ మెచ్చే సన్నివేశాలు

మైనస్‌ పాయింట్స్‌ :

  • రొటీన్ కథ
  • సెకండ్ హాఫ్ ఫైట్స్

రేటింగ్ :  2.5 / 5

7,209 total views, 49 views today