స్వల్పంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

దేశంలో ఇంధన ధరలు వరుసగా రెండో రోజు కూడా పెరిగాయి. పెట్రోల్, డీజిల్ ధరలు శుక్రవారం (జనవరి 11) స్వల్పంగా పైకి కదిలాయి. దాదాపు 20 రోజుల విరామం అనంతరం సోమవారం (జనవరి 7) పెరిగిన పెట్రో ధరలు మంగళ, బుధ వారాల్లో స్థిరంగా ఉన్నాయి. అయితే గురువారం పెరిగాయి. శుక్రవారం కూడా ఇదే ట్రెండ్ నమోదయ్యింది. దీని ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోలు ధర 19 పైసలు, లీటరు డీజిల్ ధర 28 పైసలు పెరిగింది. దీంతో పెట్రోల్ ధర రూ.69.07కి చేరితే.. డీజిల్ ధర రూ.62.81 వద్ద కొనసాగుతోంది. వాణిజ్య రాజధాని ముంబయిలో పెట్రోలు ధర రూ.74.72 ఉండగా.. డీజిల్ ధర రూ.65.73 వద్ద కొనసాగుతోంది.

హైద‌రాబాద్‌లో పెట్రోల్ ధర రూ.73.27 ఉండగా.. డీజిల్ ధర రూ.68.28 వద్ద కొనసాగుతోంది. అమరావతిలో పెట్రోల్‌ రూ.73.11 వద్ద, డీజిల్‌ రూ.67.79 వద్ద కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర స్వల్పంగా తగ్గింది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 61.39 డాలర్ల వద్ద ఉండగా.. డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 52.41 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

35 total views, 1 views today