బిగ్ బాష్ మ్యాచ్ లో బెన్ కటింగ్ కి గాయాలు

ఐపీఎల్ తరహాలో ఆస్ట్రేలియా‌లో జరుగుతున్న బిగ్‌బాస్ లీగ్‌లో ఈరోజు ఫీల్డర్ బెన్‌ కటింగ్ తీవ్రంగా గాయపడ్డాడు. బ్రిస్బేన్ హీట్‌ జట్టు తరఫున మ్యాచ్ ఆడుతున్న బెన్ కటింగ్ క్యాచ్ అందుకోవడంలో తడబడగా.. బంతి వేగంగా వచ్చి అతని ముఖంపై పడింది. దీంతో.. ముక్కుకి తీవ్ర గాయమవగా.. పెద్ద ఎత్తున వచ్చిన రక్తంతో అతని ముఖం తడిసిపోయింది. అయితే.. చికిత్స అనంతరం మళ్లీ బెన్‌ కటింగ్ ఫీల్డింగ్‌ కోసం మైదానంలోకి రావడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ఆడుతూ బెన్ కటింగ్‌ వెలుగులోకి వచ్చాడు. ఫాస్ట్ బౌలింగ్‌తో పాటు డెత్ ఓవర్లలో అతను కొట్టిన భారీ సిక్సర్లు 2016లో హైదరాబాద్ జట్టు టైటిల్‌ గెలవడంలో క్రియాశీలకంగా పనిచేశాయి. తాజాగా బిగ్‌బాస్ లీగ్‌లో బ్రిస్బేన్ హీట్‌‌కి ఆడుతున్న ఈ ఆల్‌రౌండర్.. ఈరోజు మెల్‌బోర్న్ రెనిగేడ్స్‌‌పై మ్యాచ్ ఆడుతూ గాయపడ్డాడు.

16 total views, 1 views today