ఇండియాతో వ‌న్డే సిరీస్‌కు 80ల్లోని జెర్సీలతో ఆస్ట్రేలియా టీమ్.. వీడియో

మెల్‌బోర్న్: ఇండియాతో జరగబోయే వన్డే సిరీస్‌కు పాత కాలపు జెర్సీలతో బరిలోకి దిగుతున్నది ఆస్ట్రేలియా టీమ్. 1986లో అప్పటి అలన్ బోర్డర్ టీమ్ వేసుకున్న గ్రీన్, గోల్డ్ రంగుల జెర్సీలతో ఆసీస్ టీమ్ కనిపించనుంది. ఈ రంగు జెర్సీలు ఆస్ట్రేలియా టీమ్ తొలిసారి వేసుకున్న సమయంలో.. ఆ టీమ్ ప్రస్తుత బౌలర్ పీటర్ సిడిల్ వయసు ఏడాది మాత్రమేనని క్రికెట్ ఆస్ట్రేలియా గుర్తు చేసింది. ఈ రెట్రో కిట్స్‌తో బరిలోకి దిగడం ఎంతో ఉత్సాహంగా అనిపిస్తున్నదని ఈ సందర్భంగా సిడిల్ అన్నాడు. ఇలా ఒకనాటి జెర్సీలతో తాము ఇండియాతో సిరీస్ ఆడబోతున్నామని తెలిసి ఎంతో ఉత్సాహంగా అనిపించిందని, ఎప్పుడెప్పుడు ఆ జెర్సీలు వేసుకోవాలా అని టీమ్ మెంబర్స్ ఎదురు చూసినట్లు అతను చెప్పాడు. సిడిల్ ఆస్ట్రేలియా తరఫున చివరిగా 2010లో వన్డే మ్యాచ్ ఆడాడు. ఈ నెల 12న సిడ్నీలో ఇండియా, ఆస్ట్రేలియా తొలి వన్డే జరగనుంది. ఆ తర్వాత అడిలైడ్, మెల్‌బోర్న్‌లలో మరో రెండు వన్డేలు జరుగుతాయి.

28 total views, 1 views today