తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమల ఏడుకొండలవాడి దర్శనానికి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీనివాసుడి దర్శనానికి భక్తులు 5 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 6 గంటల సమయం, టైమ్‌స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 3 గంటల సమయం పడుతుంది. స్వామివారిని నిన్న 71,072 మంది భక్తులు దర్శించుకున్నారు. 18,292 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం నిన్న రూ. 2.82 కోట్లుగా ఉంది.

27 total views, 1 views today