ఒక్క‌టైన నోయ‌ల్‌, ఎస్త‌ర్

సింగ‌ర్‌గాను, న‌టుడుగాను తెలుగు ప్రేక్ష‌కుల‌ని అలరిస్తున్న నోయ‌ల్ పాపులర్ న‌టి ఎస్త‌ర్ నోరోన్హ‌ని కొద్ది సేప‌టి క్రితం వివాహం చేసుకున్నాడు. వీరి వివాహం క్రైస్త‌వ ప‌ద్ధ‌తిలో ఘ‌నంగా జ‌రిగింది. కొన్నాళ్ళ‌పాటు ప్రేమాయ‌ణంలో ఉన్న ఈ జంట నేడు ఎట్ట‌కేల‌కి ఒక్క‌ట‌య్యారు. వీరికి ర‌ష్మీ, అన‌సూయ త‌దిత‌రులు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. నోయ‌ల్ స్నేహితులు పెళ్లి వేడుక‌లో పాల్గొని సంద‌డి చేశారు. నోయ‌ల్ చాలా చిత్రాల‌లో స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్స్ వేసి మెప్పించాడు. ఎస్త‌ర్ .. తేజ తెర‌కెక్కించిన వెయ్యి అబ‌ద్ధాలు సినిమాతో పాపుల‌ర్ అయింది. ఆ తర్వాత బోయ‌పాటి శీను తెర‌కెక్కించిన జ‌య జాన‌కి నాయ‌క చిత్రంలోను న‌టించింది. ప్ర‌స్తుతం హిందీ, మ‌రాఠీ, తెలుగు , త‌మిళ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉంది ఈ అమ్మ‌డు. రీసెంట్‌గా వీరిద్ధ‌రు కొంక‌ణి వ‌ర్షెన్‌లో డిస్పెకిటో అనే క‌వ‌ర్ సాంగ్ చేశారు. ఈ సాంగ్‌కి యూ ట్యూబ్‌లో రెండు ల‌క్ష‌ల‌కి పైగా వ్యూస్ వ‌చ్చాయి .

5,709 total views, 52 views today