తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీనివాసుడి దర్శనానికి భక్తులు 15 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. ఏడుకొండలవాడి సర్వదర్శనానికి 7 గంటలు, టైమ్‌స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 3 గంటల సమయం పడుతుంది. స్వామివారిని నిన్న 59,473 మంది భక్తులు దర్శించుకున్నారు. 19,166 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం నిన్న రూ. 2.46 కోట్లుగా ఉంది.

51 total views, 1 views today