నేడు కేరళ బంద్‌

మహిళల శబరిమల ఆలయ ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ నేడు కేరళ బంద్‌ పాటించనున్నారు. నిన్న ఇద్దరు మహిళలు ఆలయంలో ప్రవేశించడంతో ఇందుకు నిరసనగా శబరిమల పరిరక్షణ సమితి కేరళ బంద్‌కు పిలుపునిచ్చింది. కాగా ఇద్దరు మహిళలు అయ్యప్ప గుడిలోకి ప్రవేశించడాన్ని వ్యతిరేకిస్తూ కేరళ వ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో నిరసనలు తెలుపుతున్నారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే మహిళలు సన్నిధానంలోకి వెళ్ల గలిగారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనతో త్రివేండ్రంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఉద్రిక్తతల నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారు.

50 total views, 1 views today