అయ్యప్పను దర్శించుకున్న ఆ ఇద్దరు మహిళలు వీళ్లే..

శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్న ఇద్దరు మహిళలు వీళ్లే. బిందు, కనకదుర్గ అనే ఇద్దరు మహిళలు ఇవాళ తెల్లవారుజామున శబరిమల అయ్యప్పను దర్శించుకున్నారు. బిందు వయసు 42 ఏళ్లు. కన్నూరు వర్సిటీలో ఉన్న స్కూల్ ఆఫ్ లీగల్ స్టడీస్‌లో ఆమె కాలేజీ లెక్చరర్‌. మరో భక్తురాలు కనకదుర్గ వయసు 44 ఏళ్ల. మలప్పురంలోని సివిల్ సప్లయ్స్ డిపార్ట్‌మెంట్‌లో ఆమె కాంట్రాక్టు ఉద్యోగి. శబరిమలకు వెళ్లడం వల్ల కోజకొత్తూర్‌లోని కనకదుర్గ ఇంటి ముందు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. కనకదుర్గ భర్త ఉండే ఇంటి ముందు కూడా సుమారు వంద మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. అయితే కనకదుర్గ కుటుంబం మాత్రమే ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడారు. శబరిమల సాంప్రదాయాన్ని ఉల్లంఘించినట్లు వాళ్లు ఆరోపించారు. ఆమె సోదరుడు భరత్‌భూషణ్ ఆందోళన వ్యక్తం చేశాడు. కొన్ని రోజులుగా ఆమె ఆచూకీ లేదని, పోలీసులకు ఫిర్యాదు చేసినా, ఆమె జాడ కనబడలేదన్నారు. 10 నుంచి 50 ఏళ్ల వయసున్న ఇద్దరు మహిళలు కూడా అయ్యప్పను దర్శించుకోవచ్చు అని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తీర్పును వ్యతిరేకిస్తూ కేరళలో ఆందోళనలు మిన్నంటాయి.

47 total views, 1 views today