టాటూ అర్ధం చెప్పేసిన‌ అన‌సూయ‌

ఇటు యాంక‌ర్‌గా అల‌రిస్తూనే అడ‌పాద‌డ‌పా వెండితెర‌పై కూడా మెరుస్తుంది అన‌సూయ‌. రంగ‌స్థ‌లం చిత్రంలో రంగ‌మ్మ‌త్త పాత్ర పోషించినందుకు అన‌సూయ‌కి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ల‌భించాయి. దీంతో ఈ అమ్మ‌డిని అనేక క్రేజీ ప్రాజెక్టులు ప‌ల‌కరిస్తున్నాయి. త్వ‌ర‌లో విడుద‌ల కానున్న ఎఫ్‌2 చిత్రంలో అనసూయ అతిథి పాత్రలో నటించ‌డంతో పాటు ప్రత్యేక గీతంలోనూ కనిపించనుంది. అయితే ఈ అమ్మ‌డు జనవరి 1న ‘ఆస్క్ అనసూయ’ పేరుతో ట్విట్ట‌ర్‌లో తన అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ క్ర‌మంలో త‌న ఛాతిపై ఉన్న టాటూకి అర్ధం ఏమిట‌ని ఓ నెటిజ‌న్ అడ‌గ‌గా, దానికి అన‌సూయ స్పందిస్తూ.. ఆ టాటూపేరు నిక్కు. నా భర్త ముద్దు పేరు అని వెల్లడించారు. అలాగే మ‌రో నెటిజన్ .. ‘మీ మొదటి జీతం లేదంటే పారితోషికం ఎంత?’ అని ప్రశ్నించారు. తన తొలి జీతం రూ.5,500 అని అనసూయ సమాధానం ఇచ్చారు

96 total views, 1 views today