రాజ‌మౌళి త‌న‌యుడి పెళ్లి వీడియో షేర్ చేసిన సుస్మితా సేన్

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాజమౌళి కుమారుడు కార్తికేయ పెళ్లి జగపతిబాబు సోదరుడు రాం ప్రసాద్ కుమార్ కుమార్తె పూజా ప్రసాద్‌తో ఆదివారం( డిసెంబ‌ర్ 30) సాయంత్రం రాజస్థాన్‌లోని జైపూర్ సమీపంలో గల హోటల్ ఫెయిర్‌మౌంట్‌లో ఘ‌నంగా జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. హిందూ సంప్ర‌దాయం ప్ర‌కారం జ‌రిగిన వీరి వివాహానికి ప్ర‌భాస్, రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్‌, రానా, నాని , నాగార్జున, రాఘ‌వేంద్ర‌రావు, అఖిల్ తో పాటు త‌దిత‌ర ప్ర‌ముఖులు కూడా హాజ‌ర‌య్యారు . బాలీవుడ్ భామ సుస్మితా సేన్ తాను ద‌త్త‌త తీసుకున్న పిల్ల‌ల‌ని వెంట పెట్టుకొని వివాహానికి హాజ‌రైంది. పెళ్లిలో సెల‌బ్రిటీలు అంద‌రు ఫుల్ హంగామా చేశారు. సుస్మితా సేన్ మాత్రం ఘ‌నంగా జ‌రిగిన పెళ్లికి సంబంధించిన వీడియో తీసి ఆ వీడియోని తాజాగా త‌న ట్విట్ట‌ర్‌లో షేర్ చేసింది. త‌లంబ్రాల‌లోని ఒక్కో గింజ మీకు దీవెన‌లు, ప్రేమ‌, సంతోషం, ఆశీర్వాదం అందివ్వాల‌ని మీరు ఎప్పుడు సుఖ సంతోషాల‌తో హ్యాపీగా ఉండాల‌ని కోరుకుంటున్నాను అని కామెంట్ పెట్టింది సుస్మితా. పెళ్లి ఎంత అందంగా జ‌రిగిందో అని కూడా త‌న కామెంట్‌లో తెలిపింది. కార్తికేయ‌, పూజాలు జీల‌క‌ర్ర బెల్లం పెట్టుకుంటున్న ఫోటో షేర్ చేసి.. ఇది ఉపాస‌న తీసిందని రానా తెలిపాడు.

86 total views, 1 views today