తిరుమలలో రేపు ఎల్లుండి అంతర్జిత సేవలకు బ్రేక్

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి నూతన సంవత్సరం సందర్భంగా డిసెంబరు 31, జనవరి 1న ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తితిదే వెల్లడించింది. యాత్రికుల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయాలను తీసుకుంది. ఆదివారం అర్ధరాత్రి నుంచి కాలినడకన వచ్చే భక్తులకు దివ్యదర్శనం టోకెన్ల జారీని, వృద్ధులు, దివ్యాంగులకు, చంటిబిడ్డలతో పాటు తల్లిదండ్రులకు, దాతలకు ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్లు వివరించింది. రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో వీఐపీ బ్రేక్‌ దర్శనాలపై జనవరి 6 వరకు సిఫార్సు లేఖలు స్వీకరించబోమని, ప్రొటోకాల్‌ ప్రముఖులకు మాత్రమే పరిమితం చేస్తామని స్పష్టం చేసింది. జనవరి 2 నుంచి యథావిధిగా ఆర్జిత సేవలు, ఇతర ప్రత్యేక దర్శనాలు కొనసాగుతాయని తెలిపింది.

38 total views, 1 views today