ఇక ఛానెల్స్ మన ఇష్టం !

కొత్తగా టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ అమలు చేస్తున్న బ్రాడ్ కాస్టింగ్, కేబుల్ టీవీ సర్వీసెస్‌తో వీక్షకులను స్వేచ్ఛ లభించబోతున్నది. కేబుల్ టీవీ డిజిటలైజేషన్‌లో భాగంగా కొత్త మార్గదర్శకాలను అమలుచేస్తున్నది. ఛానళ్ల ఎంపికలో పారదర్శకత, వినియోగదారుడి ఇష్టానికి అధిక ప్రాధాన్యతనిచ్చిం ది. నచ్చిన ఛానల్‌ను ఎంచుకుని..కావాల్సిన ఛానల్ ను చూడవచ్చు. వినియోగదారులుతో నిమిత్తం లేకుం డా కేబుల్ ఆపరేటర్లు ఇష్టారీతిన ఛానళ్లను రుద్దు తున్నారన్న ప్రచారం నేపథ్యంలో ట్రాయ్ కొత్త మా ర్గదర్శకాలను రూపొందించింది. 6 మాసాల పాటు కసరత్తు, సంప్రదింపుల తర్వాత డిసెంబర్ 28 నుం చి ఈ విధానాన్ని అమలు చేయా లని నిర్ణయించిం ది. డిసెంబర్ 28 లోపు ప్రక్రియనంతా పూర్తిచేసి, 29 నుంచి కొత్త మార్గదర్శకాల ప్రకారం అమలుచేయాలన్న ట్రాయ్ హెచ్చరికల నేపథ్యంలో వినియోగదారుల్లో గందరగోళం నెల కొంది. దీనికి ఇటీవలే ట్రాయ్ స్పష్టత నిచ్చింది. కేబుల్ కనెక్షన్లను ఎట్టి పరిస్థితుల్లో తొలగించరాదని ఆదేశించింది.

కేబుల్ టీవీ డిజిటలైజేషన్ ప్రక్రియ 2012లో ప్రా రంభమయ్యింది. ఎంఎస్‌వోలు, కేబుల్ ఆపరేటర్ల అభ్యంతరాలతో సుదీర్ఘంగా కొనసాగిన ఈ ప్రక్రియ మార్చి 2017తో ముగిసింది. సెట్‌టాప్ బాక్స్‌ల బిగింపుతో ప్రేక్షకులకు నాణ్యమైన ప్రసారాలు అం దుతున్నాయి. ఒక్కో వీక్షకుడు గరిష్టంగా 40 కంటే మించి ఛానళ్లను చూడడం లేదని బార్క్ అధ్య యనంలో తేలింది. కాని హైదరాబాద్‌లో కేబుల్ ఆపరేటర్లు నెలకు రూ. 220 తీసుకుంటూ 230 పై గా ఛానళ్లను అందిస్తున్నారు. అందులో సింహాభా గం 130 వరకు ప్రీ ఛానళ్లే ఉండటంతో 40 ఛానళ్లు వీక్షించే వారిపై 230 ఛానళ్ల భారాన్ని మోపడమెందుకన్న ఆలోచనతోనే ఈ విధానానికి ట్రాయ్ శ్రీకా రం చుట్టింది. ఎన్ని ఛానళ్లు వీక్షిస్తే అన్ని ఛానళ్లకు ఛా ర్జీలు చేసేలా మార్గదర్శకాలను రూపొం దించింది.

– ఉచితంగా లభించే ఛానళ్లు( ప్రీ టూ ఏయిర్)ను ఒక కోటాగా
– వేర్వేరుగా ఉన్న ఎస్‌డీ, హెచ్‌డీ పే ఛానళ్లు ఒక్కోదానికి ఒక్కో ధర
– ఒకే గ్రూపుకు క్రింద పే ఛానళ్లంటికి ఒకే ధర
– ప్రీ టూ ఏయిర్ ఛానల్స్ కోటాలో రూ. 130లకే 100 ఎస్‌డీ ఛానల్స్‌ను ఉచితంగా అందిస్తారు. ఇక ఉచిత ఛానళ్లు 100 మించితే 25 ఛానళ్లు ఒక స్లాబ్ గా చేర్చి ఒక్కో స్లాబ్‌కు రూ. 20లు వసూలు చేస్తారు.
– ఒక్కోక్కటిగా ఉన్న పే ఛానళ్లుగా ఒక్కో ధర వర్తిస్తుంది. ఉదాహరణకు నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్‌కు రూ. 2, డిస్కవరీ ఛానల్‌కు రూ. 4 చొప్పు న చెల్లించాలి.
– ఒకే గ్రూపు క్రింద ఛానళ్లంటికి ఒకే ధరను నిర్ణయించారు. ఉదాహరణకు స్టార్+ మా గ్రూపు లోని 10 ఛానళ్లకు రూ. 39 చెల్లించాలి.
ఉచిత ఛానళ్లు రూ. 130 + జీ తెలుగు రూ. 19+ జెమిని రూ. 19+ ఈ టీవీ రూ. 19+ మా టీవీ రూ. 19 మొత్తంగా రూ. 244లు (జీఎస్టీ అధనం)

కేబుల్ ఆపరేటర్ ఇస్టానుసారంగా ప్లాన్‌ను మార్చడా నికి వీల్లేదు. కేబుల్ ఆపరేటర్ ఇష్టానుసారాంగా ఛానళ్లను ప్రసారం చేయడానికి లేదు. వినియో గదారుడి నుంచి కన్సెంట్ తీసుకున్న తర్వాత, ఆయన సమ్మతితో మాత్రమే ఛానళ్లను ప్రసారం చేయాలి. తమకు నచ్చని ఛానళ్లను వినియోగ దారుడు 15 రోజుల ముందుగానే తొలగించమని సూచించాలి.
కొత్త కనెక్షన్ తీసుకోవాలంటే..
డిస్ట్రిబ్యూటర్, టెలివిజన్ ఛానల్స్‌వారు స్థానిక కేబుల్ ఆపరేటర్‌తో అనుసంధానించబడి ఉంటారు. వన్‌టైం ఇన్‌స్టాలేషన్ క్రింద రూ. 350కి మించ కుండా తీసుకుని కొత్త కనెక్షన్‌ను జారీచేస్తారు. ఇక టెలివిజన్ బ్రాడ్‌కాస్టింగ్ సర్వీసుల కోసం యాక్టి వేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి గాను రూ. 100కు మించకుండా తీసుకుకోవచ్చు.
సెట్‌టాప్ బాక్స్‌లు ఉంటాయి..
కొత్త విధానంలోనూ సెట్‌టాప్ బాక్స్‌లు ఉంటాయి. వీక్షకులంతా సెట్‌టాప్ బాక్స్‌లను తీసుకోవాల్సిందే. సెట్‌టాప్ బాక్స్‌ల పేరుతో ఇక నుంచి కేబుల్ అద్దెను వసూలు చేయరాదు.

ఔట్‌రైట్ పర్చేజ్ స్కీమ్, రెంటల్ స్కీమ్‌లుంటాయి. ప్రతి డిస్ట్రిబ్యూటర్, ఆపరేటర్ ప్రీపేయిడ్, పోస్ట్ పేయి డ్ పద్ధతిలో చెల్లింపులు జరుపుకునేలా వెసులుబాటు కల్పించాలి. వీక్షకుడు ఎంచుకున్న ఛానళ్లను బట్టి దాంట్లో నుంచి డబ్బులు కట్ అయ్యే ఏర్పాట్లు ఉం డాలి. అదనంగా డబ్బులు తీసుకుంటే 7 రోజుల్లోగా వాపసు చేయాలి.
ఎక్కువ వసూలు చేస్తే..
కేబుల్ ఆపరేటర్లు సూచించిన దానికన్నా అధిక మొ త్తంలో వసూలు చేస్తే కన్జ్యుమర్ కంప్లయింట్ రిడ్రె స్సల్ ( డిజిటల్ అడ్రసేబుల్ కేబుల్ టీవీ సిస్టం) విభాగానికి ఫిర్యాదు చేయవచ్చు. సర్వీసు ఏరియాకు ఒకటి చొప్పున ఈ విభాగాలుంటాయి. కన్జ్యుమర్ కేర్ నెంబర్‌ను సైతం నిర్వహించి ఫిర్యాదులు స్వీకరించాలి.

73 total views, 2 views today