దేశంపై జనసేన జెండా ఖాయం : పవన్‌

తాను పార్టీ ఫండ్‌ కోసం అమెరికా రాలేదని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. ఇవాళ డల్లాస్‌లో ‘జనసేన ప్రవాస గర్జన’లో ఆయన మాట్లాడుతూ… తాను ఆత్మగౌరవంతో బతుకుతున్నవాడినని చెప్పారు. రాజకీయాల్లోకి రావాలంటే గొప్ప తెలివితేటలు అక్కర్లేదన్న పవన్‌.. ధైర్యంతోపాటు కమిట్‌మెంట్‌ ఉంటే చాలని అభిప్రాయపడ్డారు. ఏదో ఒక రోజు భారతదేశంలో జనసేన జెండా ఎగురుతుందని పవన్‌ అన్నారు. తెలుగువారి తరఫున పోరాడేందుకు జనసేన సిద్ధంగా ఉందని.. హెచ్1బీ వీసాల విషయంలో అవసరమైతే కేంద్రంతోపాటు అమెరికా అధికారులతోనూ మాట్లాడుతామని స్పష్టం చేశారు.

206 total views, 1 views today